రక్త చరిత్ర - ఆ పేరే నాకు ఆ సినిమా మీద పెద్ద ఆసక్తి లేకుండా చేసింది. రక్త చరిత్ర - వర్మ గారికి ఇంక ఏ పేరూ దొరకలేదా? యూత్ అనే ఒక section of audience తప్పితే ఇంకెవరూ దానిని చూడడానికి ధైర్యం చేసేలా లేదు ఆ పేరు. సరే పేరుని అలా పక్కన పెడితే...
ఈ సినిమా లో ఏ పాత్రలూ ఎవరినీ ఉద్దేశించినవి కావు ... అనే standard disclaimer వేస్కున్నా ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపూర్ లో factionist గొడవలూ ముఖ్యంగా పరిటాల రవీంద్ర కథ అని అందరికీ తెలుసు. Based On A True Story అని ఆ disclaimer వెంటే చూపించారు కూడా.
ఒక సినిమా రెండు భాగాలూ ఒక వారం రోజుల తేడాలో విడుదల చేయటం భారతీయ (ప్రపంచ?) సినీ చరిత్ర లోనే ఒక achievement అనుకుంటా.
మొదటి భాగంలో మొదట చూపించిన కొన్ని murder సీన్లు mechanical గా ఇంపాక్ట్ లేనట్లు గా అనిపించాయి. శివ సినిమాలో శుభలేఖ సుధాకర్ murder చాలా powerful గా ఉంటుంది. ప్రేక్షకులని కదిలించే విధంగా ఉంటుంది. ఈ సినిమా లో బుక్కా రెడ్డి murder సీన్ మంచి intense గా picturize చేశారు వర్మ. ఒక murder సీన్ చూపిస్తూ బాక్గ్రౌండ్ లో శివ స్తోత్రం , మృత్యుంజయ మంత్రం పెట్టటం బహుశా వర్మ గారికే చెల్లింది. Narration లో మాత్రం వర్మ గారి వాయిస్ హాస్యాస్పదం గా అనిపించింది. మంచి గంభీరమైన వాయిస్ ఉన్న ఇంకెవరి చేతైనా చెప్పిస్తే బాగుండేది. మొదటి భాగం లో బెస్ట్ acting అభిమన్యు సింగ్ ది అనిపించింది . బుక్కా రెడ్డి పాత్ర లో చాలా బాగా నటించారు. అడవిలో పాట (సుఖ్విందర్ సింగ్) అనవసరం.
ఇక రెండవ భాగానికి వస్తే 'ఎఫ్ఫెక్ట్' కోసం అని అతిగా slow motion వాడి బోర్ కొట్టించారు వర్మ. ఇంకేదో ఎఫ్ఫెక్ట్ కోసం కెమెరా ని తలకిందులు గా కూడా పెట్టి కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇలాంటివి అనవసరం అనిపించింది. హిందీ లో కూడా విడుదల చేశారు కాబట్టి Non Telugus ఈ కథ కి ఎంత connect అవుతారనేది ప్రశ్నార్ధకమే. రెండవ భాగం లో acting తో ఆకట్టుకున్న నటుడు సుదీప్. DCP పాత్రలో బాగా చేశారాయన.
మొత్తానికి Run Of The Mill రొమాంటిక్ మూవీస్ మరియు standard concepts తో వస్తున్న ఈ మధ్య సినిమాల కంటే రక్త చరిత్ర బాగుంది అనిపించింది. My Rating 3/5. ఇదీ నా రివ్యూ. టాపిక్ ఈజ్ ఓవర్. (NTR గారు నిజంగానే అలా అనేవారా?)
I had Google Translate convert this to English so I could read it :)
ReplyDelete:) Hope it made sense.
DeleteThis comment has been removed by the author.
ReplyDelete